ప్రపంచ భౌగోళిక రాజకీయాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో భారత్ తన విదేశాంగ వ్యూహంలో కీలక మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో నెదర్లాండ్స్, స్వీడన్‌లతో భాగస్వామ్య బంధాన్ని వ్యూహాత్మక స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. రక్షణ, విలువైన ఖనిజాలు, సాంకేతికత, ఇతర కీలక రంగాల్లో నెదర్లాండ్స్‌తో 17 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇవి భారత ప్రధాని నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెటెన్ సమక్షంలో కుదిరాయి.
ఐరోపా పర్యటనలో భాగంగా శనివారం రాత్రి జరిగిన భేటీలో ఇరువురు నేతలు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై పడుతున్న ప్రభావం, వాణిజ్య మార్గాల్లో ఏర్పడుతున్న అంతరాయాలపై సమీక్షించారు. హర్మూజ్ జలసంధి మీదుగా నౌకాయానానికి ఎదురవుతున్న అడ్డంకులపై ప్రత్యేకంగా చర్చించారు. నౌకాయాన స్వేచ్ఛకు భంగం కలగకూడదని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం నియంత్రణలు లేకుండా వ్యవస్థ కొనసాగాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ దిశగా జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇవ్వాలని సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు. అలాగే ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన అంతర్జాతీయ చట్టాల పరిధిలో జరగాలని ఆకాంక్షించారు.
మోదీ తన సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ, ఈ పర్యటన భారత్–నెదర్లాండ్స్ సంబంధాలకు కొత్త ఊపు ఇచ్చిందని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల కోసం భారతీయులకు నెదర్లాండ్స్‌లో అవకాశాలు పెంచే ఒప్పందం కూడా కుదిరింది. ఈ సందర్భంగా మోదీ, జెటెన్ కలిసి చరిత్రాత్మక అఫ్‌స్లుట్జిక్ జలాశయాన్ని సందర్శించి కొంతసేపు విహరించారు.
అయితే నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెటెన్ చేసినట్లు వచ్చిన పత్రికా స్వేచ్ఛ, మైనారిటీ హక్కులపై ఆరోపణలను భారత్ అధికారికంగా ఖండించింది.
ఐరోపా పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ నుంచి స్వీడన్ చేరుకున్న ప్రధాని మోదీ, అక్కడ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్‌సన్‌తో వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వాన్ని, భారత్–స్వీడన్ సంబంధాల బలోపేతానికి చేసిన కృషిని గుర్తిస్తూ స్వీడన్ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్ఠాత్మక ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్’ పురస్కారాన్ని అందజేసింది. యువరాణి విక్టోరియా చేతుల మీదుగా మోదీ ఈ అవార్డును స్వీకరించారు.
ఇప్పటివరకు మోదీ విదేశాల్లో 31 అంతర్జాతీయ పురస్కారాలు స్వీకరించారు. ఇదే పర్యటనలో మర్స్క్ ఛైర్మన్ రాబర్ట్ మర్స్క్ ఉగ్లాతో సమావేశమై భారత్‌లో పోర్ట్ పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. స్వీడన్ వాయుసేన విమానాలు మోదీ ప్రయాణిస్తున్న విమానానికి ఎస్కార్ట్‌గా వచ్చి ప్రత్యేక గౌరవం ఇవ్వడం విశేషంగా నిలిచింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















