తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వచ్చే ఏడాది వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే పోలీసు శాఖతో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసులకు ఈ వయో సడలింపు వర్తించదని వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నిరుద్యోగులకు అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం గరిష్ఠ వయోపరిమితిని పదేళ్ల పాటు సడలించింది. అనంతరం ఆ గడువును మరో రెండేళ్లు పొడిగించింది. ఇటీవల ఆ గడువు ముగియడంతో మరోసారి వయోపరిమితి పెంపు కోరుతూ నిరుద్యోగులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తాజాగా మరో ఏడాది పాటు సడలింపు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులకు ఊరట లభించినట్లు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















