కోల్‌కతా కేంద్రంగా ఉన్న Hindustan Copper Limited (HCL) సంస్థ 70 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మైనింగ్, జియాలజీ, ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, సేఫ్టీ అండ్ ఫైర్ సర్వీసెస్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, హెచ్‌ఆర్, ఫైనాన్స్ వంటి పలు విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
మొత్తం పోస్టులు మూడు కేటగిరీలుగా ఉన్నాయి:
సీనియర్ మేనేజర్ (E4) – 16 పోస్టులు (వేతనం రూ.70,000–2,00,000)
మేనేజర్ (E3) – 16 పోస్టులు (వేతనం రూ.60,000–1,80,000)
డిప్యూటీ మేనేజర్ (E2) – 38 పోస్టులు (వేతనం రూ.50,000–1,60,000)
వయోపరిమితి పోస్టు స్థాయిని బట్టి 40 నుండి 47 సంవత్సరాల వరకు ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.ఎంపిక ప్రక్రియలో విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకే 100% వెయిటేజీ ఉంటుంది.ఆన్‌లైన్ దరఖాస్తులు 05 జూన్ 2026 నుంచి 25 జూన్ 2026 వరకు స్వీకరించబడతాయి. అధికారిక వెబ్‌సైట్: https://www.hindustancopper.com/
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















