ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ వాల్‌స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో “SPCX” టికర్ సింబల్‌తో స్పేస్‌ఎక్స్ IPO ప్రారంభం కావచ్చని సమాచారం. ఇప్పటికే సంస్థ అవసరమైన ఫైలింగ్ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
స్పేస్‌ఎక్స్ IPO ద్వారా ఎలాన్ మస్క్ సంపద భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయనకు సంస్థలో పెద్ద మొత్తంలో వాటాలు ఉన్నాయి. ఈ IPO తర్వాత ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా (లక్ష కోట్ల డాలర్ల సంపద అధిపతి) నిలిచే అవకాశముందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్పేస్‌ఎక్స్ విలువ సుమారు 1.25 ట్రిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా.
గత ఏడాది స్పేస్‌ఎక్స్ 18.6 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించినప్పటికీ 4.9 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది. కంపెనీ వద్ద 102 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉండగా, 60.5 బిలియన్ డాలర్ల అప్పులు కూడా ఉన్నాయని సమాచారం. అంతేకాకుండా పలు న్యాయపరమైన కేసులను కూడా సంస్థ ఎదుర్కొంటోంది.
ఇక ఇదే సమయంలో మరో కీలక పరిణామం కూడా జరుగుతోంది. ఓపెన్‌ఏఐ (ChatGPT మాతృసంస్థ) కూడా IPOకు సిద్ధమవుతోంది. వాల్‌స్ట్రీట్‌లో అతిపెద్ద లిస్టింగ్స్‌లో ఒకటిగా ఇది నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే సంస్థ విలువ సుమారు 850 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. ఈ ఏడాది చివరి నాటికి IPO మార్కెట్లోకి వచ్చే అవకాశముందని సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















