ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతికతతో పాటు ఆధ్యాత్మికత, సుస్థిర ఆరోగ్య రంగాల్లోనూ దేశంలోనే ప్రత్యేక గమ్యస్థానంగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రంలో నిర్వహించిన సంస్థ 45వ వార్షికోత్సవ సత్సంగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రవిశంకర్ గురూజీతో కలిసి చంద్రబాబు 15 నిమిషాల పాటు ధ్యానం చేశారు. అనంతరం మాట్లాడుతూ సాంకేతికత మనిషి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తే, ఆధ్యాత్మికత క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అందిస్తుందని చెప్పారు.తిరుమల, శ్రీశైలం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు కలిగిన ఆంధ్రప్రదేశ్‌ను ఇకపై ఆధ్యాత్మికత, వెల్‌నెస్, నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఇందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ వంటి ఆధ్యాత్మిక నాయకుల మార్గదర్శకత్వం అవసరమని పేర్కొన్నారు.
ప్రపంచం ప్రస్తుతం యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలతో సతమతమవుతోందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఈ పరిస్థితుల నుంచి బలంగా బయటపడగలదని చంద్రబాబు అన్నారు. “2047 వికసిత్ భారత్” లక్ష్యానికి “స్వర్ణాంధ్ర-47” తోడ్పడుతుందని తెలిపారు. భవిష్యత్ నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని వెల్లడించారు.ఈ సందర్భంగా రవిశంకర్ గురూజీ చంద్రబాబును ప్రశంసిస్తూ భారత ఐటీ రంగానికి సూత్రధారి అని అభివర్ణించారు. మూడు దశాబ్దాల క్రితమే ఐటీ రంగానికి పునాది వేసి, యువతకు సాంకేతిక నైపుణ్యాలను అందించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















