విశాఖపట్నం నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధికి సంబంధించిన మూడు ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు.
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) పథకం కింద జీవీఎంసీ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులకు నేషనల్ అపెక్స్ కమిటీ (NAC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం రూ.1,501.03 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులు అమలు కానున్నాయి.మధురవాడ జోన్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధికి రూ.658.61 కోట్లు కేటాయించగా, స్మార్ట్ తాగునీటి సరఫరా వ్యవస్థ కోసం రూ.725.18 కోట్లు ఖర్చు చేయనున్నారు. అదనంగా బల్క్ మరియు సెమీ బల్క్ నీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణకు రూ.117.24 కోట్లు వినియోగించనున్నారు.
ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే విశాఖలో మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కావడంతో పాటు తాగునీటి సమస్యలు తగ్గి, పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. నగర ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంలో ఇవి కీలకంగా మారనున్నాయి.ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ విశాఖను ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















