దేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయన్న వార్తలు, అలాగే ముడి చమురు ధరలు తగ్గడం వంటి అంశాలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచాయి. ఈ ప్రభావంతో సూచీలు గణనీయమైన లాభాలను నమోదు చేస్తున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 900 పాయింట్ల వరకు ఎగసింది.
ఉదయం 9.28 గంటల సమయానికి సెన్సెక్స్ 862 పాయింట్లు పెరిగి 76,282 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 261 పాయింట్ల లాభంతో 23,980 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో ఐషర్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు హిందాల్కో, ఓఎన్‌జీసీ, టీసీఎస్, మ్యాక్స్ హెల్త్‌కేర్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.35 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా సానుకూల వాతావరణం కనిపిస్తోంది. అమెరికా–ఇరాన్ శాంతి చర్చల్లో పురోగతి కనిపిస్తుండటంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. టెహ్రాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు రెండు వారాల కనిష్ఠానికి పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 4.71 డాలర్లు తగ్గి 98.81 డాలర్ల వద్ద నిలిచింది. మొత్తం మీద గ్లోబల్ సెంటిమెంట్ బలపడటంతో మార్కెట్లు పాజిటివ్‌గా కదలాడుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















