ఫ్రెంచ్ ఓపెన్‌లో భారతీయ మూలాలున్న నిశేష్ బసవరెడ్డి సంచలనం సృష్టించాడు. పారిస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏడో సీడ్ ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్‌పై 7-6(5), 7-6(5), 6-7(9), 6-1 తేడాతో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ విజయంతో నిశేష్ ఒక్కసారిగా అంతర్జాతీయ టెన్నిస్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాడు.
నిశేష్ బసవరెడ్డి 2005 మే 5న కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్‌లో జన్మించాడు. అతడి తల్లిదండ్రులు సాయిప్రసన్న, మురళీకృష్ణలు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వాసులు. వారు 1999లో అమెరికాలో స్థిరపడ్డారు.
2022లో యూఎస్ ఓపెన్‌లో ఓజాన్ బారిస్‌తో కలిసి బాయ్స్ డబుల్స్ టైటిల్ గెలుచుకుని జూనియర్ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నాడు. ఆ తర్వాత ఏటీపీ ఛాలెంజర్ టూర్‌లో 2024 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రెండు ఛాలెంజర్ టైటిళ్లు గెలిచి, నాలుగు ఫైనల్స్‌కు చేరి, 41-13 రికార్డు నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో 1978 తర్వాత ఒకే సీజన్‌లో 40కి పైగా మ్యాచ్ విజయాలు సాధించిన మూడో అమెరికన్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఇలా తన స్థిరమైన ప్రదర్శనతో నిశేష్ బసవరెడ్డి ఇప్పుడు గ్రాండ్ స్లామ్ వేదికపై తన సత్తా చాటుతూ భవిష్యత్ స్టార్‌గా ఎదుగుతున్నాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















