అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న తెలుగు యువకుడు అనురూప్‌రెడ్డి (23) నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన లూసియానాలోని టోరోడో పార్కులో ఉన్న సెబాన్ నదిలో జరిగింది.
నల్గొండ జిల్లా శాలిగౌరారం ప్రాంతానికి చెందిన కోడూరు రాజేందర్‌రెడ్డి కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఉదయ్‌గార్డెన్స్ కాలనీలో నివసిస్తోంది. వారి కుమారులు అశ్రిత్‌రెడ్డి, అనురూప్‌రెడ్డి. 2023లో అశ్రిత్, 2024లో అనురూప్ అమెరికా వెళ్లారు.
ఇటీవలే అనురూప్ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్‌లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసి, త్వరలో ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమవుతున్నాడు. ఈలోపు స్నేహితులతో కలిసి క్యాంపింగ్‌కు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
సెబాన్ నదిలో ఈత కొడుతున్న సమయంలో ముగ్గురు స్నేహితులు లోతైన నీటిలో చిక్కుకుని కేకలు వేయడంతో అనురూప్ వారిని కాపాడాడు. ఒక్కొక్కరిని ఒడ్డుకు చేర్చిన తర్వాత, తాను బయటకు వచ్చే ప్రయత్నంలో ఫిషింగ్ వైర్ కాలికి చిక్కుకుంది. అదే సమయంలో నీటి ప్రవాహం పెరగడంతో అతను మునిగిపోయాడు. సహాయకులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
కుటుంబ సభ్యులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి సంబంధిత సంస్థలు, అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















