స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI Card) క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్ జారీ చేసింది. ఫోన్‌పేతో కలిసి తీసుకొచ్చిన కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్ల ప్రోగ్రామ్‌లో కీలక మార్పులు చేసింది. ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్ (PhonePe SBI Credit Card PURPLE) మరియు ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ బ్లాక్ (PhonePe SBI Credit Card SELECT BLACK) కార్డులపై రివార్డ్ పాయింట్ల పరిమితులను సవరించింది. ఈ మార్పులు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఫోన్‌పే–ఎస్‌బీఐ పర్పుల్ కార్డ్ మార్పులు
ఈ కార్డుకు సంబంధించి ఫోన్‌పే యాప్ ద్వారా చేసే చెల్లింపులు మరియు ఇతర ఆన్‌లైన్ లావాదేవీలపై ఇచ్చే రివార్డ్ పాయింట్ల గరిష్ఠ పరిమితిని తగ్గించారు. ఇప్పటివరకు ఫోన్‌పే ఖర్చులకు 1000 పాయింట్లు, ఇతర ఆన్‌లైన్ లావాదేవీలకు 1000 పాయింట్లు చొప్పున రివార్డులు లభించేవి.
కొత్త నిబంధనల ప్రకారం, ఫోన్‌పే లావాదేవీలను రెండు కేటగిరీలుగా విభజించారు. ఇన్సూరెన్స్ బిల్ చెల్లింపులపై నెలకు గరిష్ఠంగా 250 పాయింట్లు మాత్రమే లభిస్తాయి. ఇతర ఫోన్‌పే లావాదేవీలకు 750 పాయింట్లు అందుతాయి. మొత్తంగా ఆన్‌లైన్ ఖర్చులపై రివార్డ్ పాయింట్ల పరిమితిని 1000 నుంచి 750కి తగ్గించారు.
ఫోన్‌పే–ఎస్‌బీఐ సెలెక్ట్ బ్లాక్ కార్డ్ మార్పులు
ప్రీమియం కార్డ్ అయిన సెలెక్ట్ బ్లాక్ విషయంలో కూడా రివార్డ్ నిర్మాణాన్ని సవరించారు. ప్రస్తుతం ఫోన్‌పే లావాదేవీలపై నెలకు 2000 పాయింట్లు, ఇతర ఆన్‌లైన్ ఖర్చులపై 2000 పాయింట్లు లభిస్తున్నాయి.
జులై 1 నుంచి ఫోన్‌పే యాప్ ద్వారా ఇన్సూరెన్స్ బిల్ చెల్లింపులపై 500 పాయింట్లు, మిగిలిన ఫోన్‌పే ఖర్చులపై 1500 పాయింట్లు మాత్రమే లభిస్తాయి. అలాగే ఆన్‌లైన్ ఖర్చులపై మొత్తం పరిమితిని 2000 నుంచి 1000 పాయింట్లకు తగ్గించారు.
అదేవిధంగా కొన్ని కేటగిరీలను రివార్డ్ ప్రోగ్రామ్ నుంచి పూర్తిగా మినహాయించారు. వాటిలో టోల్, బ్రిడ్జ్ చెల్లింపులు, గిఫ్ట్‌లు మరియు సావనీర్ కొనుగోళ్లు, బంగారం కొనుగోళ్లు, ఎడ్యుకేషన్ పేమెంట్స్, అలాగే ఫోన్‌పే కాకుండా ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చేసే యుటిలిటీ, ఇన్సూరెన్స్ మరియు UPI చెల్లింపులు ఉన్నాయి.
ఇతర ప్రయోజనాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని SBI Card స్పష్టం చేసింది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















