హీరోల బాడీ లాంగ్వేజ్, స్టార్‌డమ్‌కు తగ్గట్టుగా మ్యూజిక్ అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంగీత దర్శకుడు తమన్ (Thaman) తన కెరీర్, పేరుపై ఉన్న అభిప్రాయాలు, భవిష్యత్ ప్రాజెక్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అభిమానులు ఆయనను కొన్నిసార్లు ‘ఓజీ తమన్’, మరికొందరు ‘నందమూరి తమన్’ అని పిలుస్తుంటారని ప్రస్తావిస్తూ, తన అసలు ఇంటి పేరును ఉపయోగించకపోవడానికి కారణాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మా ఇంటి పేరు ఘంటసాల. ఆ పేరు నాకు పెద్ద బాధ్యతగా అనిపిస్తుంది. ఇంటి పేరుతో కాకుండా సొంత ప్రతిభతోనే ఎదగాలనుకున్నాను. ఆ పేరులో బరువే కాదు, పరువు కూడా ఉందని నమ్ముతాను. దాన్ని కాపాడటం చాలా కష్టమనిపించింది కాబట్టి వదులుకున్నాను” అని చెప్పారు.
ఇటీవల హైదరాబాద్‌లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్ గురించి మాట్లాడుతూ, ఈ నెల 13న ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. “ఏ సినిమా విడుదలైనా, ఏ క్రికెటర్ సెంచరీ చేసినా సెలబ్రేషన్స్‌లో భాగంగా ‘ఓజీ’ మ్యూజిక్‌నే ఎక్కువగా ప్లే చేస్తున్నారు. అందుకే ‘ఓజీ టూర్’ అనే పేరు పెట్టాను. నేను నా కోసం షోలు చేయను. కాన్సర్ట్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా ఛారిటీకి ఇస్తాను” అని వెల్లడించారు. బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంలో కూడా కాన్సర్ట్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తాను ప్రస్తుతం పనిచేస్తున్న సినిమాలపై కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బాలకృష్ణ–గోపీచంద్ మలినేని, చిరంజీవి–బాబీ, అఖిల్ ‘లెనిన్’, ‘ఇట్లు అర్జున’ సినిమాలు పెద్ద హిట్స్ అవుతాయని నమ్మకం వ్యక్తం చేశారు. వెంకటేశ్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై మాట్లాడుతూ, అది పూర్తి వినోదాత్మక చిత్రం అని, ఎంత రోజులు ఆడుతుందో చెప్పలేమని వ్యాఖ్యానించారు.
అలాగే నటనపై ప్రశ్నించగా, తాను నటన కొనసాగించాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే తమిళ చిత్రం ‘ఇదయమ్ మురళి’లో నటించానని, దానికి డబ్బింగ్ కూడా ప్రారంభించానని తెలిపారు. ఈ సినిమా జులైలో విడుదల కానుందని వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















