నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ చిత్రం ‘NBK 112’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా వివరాలను చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.
జూన్ 25న వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేశ్ హాజరుకానున్నట్లు సమాచారం.
మే నెలలోనే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. “అధికారానికి ఉద్దేశం తోడైతే.. అది ఉద్యమంగా మారుతుంది” అనే పవర్‌ఫుల్ కొటేషన్‌తో టీమ్ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. కొరటాల శివ మార్క్ సామాజిక సందేశంతో పాటు పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని తెలుస్తోంది.
ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘NBK 111’ చిత్రంలో నటిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ఇదే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ రెండు ప్రాజెక్టులను బాలకృష్ణ సమాంతరంగా పూర్తి చేయనున్నారని చిత్ర వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో బాలయ్య వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















