వందేళ్లలో ఎన్నడూ చూడని ప్రకృతి విపత్తుతో వెనెజువెలా దేశం తీవ్ర సంక్షోభంలో పడింది. వరుసగా సంభవించిన రెండు శక్తిమంతమైన భూకంపాల కారణంగా అనేక భవనాలు కూలిపోగా, లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులై రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో భూకంపాలు సంభవించడానికి కొన్ని క్షణాల ముందే గూగుల్ పలు స్మార్ట్‌ఫోన్లకు ముందస్తు హెచ్చరికలు పంపించినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ అలర్ట్‌లకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బుధవారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఈ హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే కాసేపటికే భూకంపాలు సంభవించాయి. గూగుల్ ఈ ముందస్తు హెచ్చరికలను తన ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్ ద్వారా పంపినట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సిస్టమ్‌లో స్మార్ట్‌ఫోన్లలో ఉండే యాక్సిలరోమీటర్ అనే సెన్సార్ కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా స్క్రీన్ రొటేషన్‌కు ఉపయోగించే ఈ సెన్సార్ భూమి కంపనాలను కూడా గుర్తించగలదు. భూమి లోపల నుంచి వచ్చే చిన్న వైబ్రేషన్స్‌ను గుర్తించిన వెంటనే ఆ సమాచారాన్ని గూగుల్ సర్వర్లకు పంపుతుంది.
ఒక ప్రాంతంలో ఒకే సమయంలో అనేక ఫోన్లు ఇలాంటి ప్రకంపనలను గుర్తిస్తే, గూగుల్ వ్యవస్థ వాటిని విశ్లేషించి భూకంపం సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. వెంటనే ఆ ప్రాంతంలోని వినియోగదారులకు అలర్ట్‌లు పంపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ సిస్టమ్ అందుబాటులో ఉన్నట్లు గూగుల్ తెలిపింది.
సాధారణంగా భూకంపాలు ఒక్కసారిగా సంభవించవు. ముందుగా ప్రైమరీ వేవ్స్ వస్తాయి, ఇవి వేగంగా ప్రయాణిస్తాయి. తరువాత సెకండరీ వేవ్స్ వస్తాయి, ఇవే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. గూగుల్ సిస్టమ్ ప్రధానంగా ఈ ప్రైమరీ వేవ్స్‌ను గుర్తించి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో కొన్ని సెకన్ల ముందే ప్రజలకు అప్రమత్తం అయ్యే అవకాశం లభిస్తుంది.
అలర్ట్‌లు రెండు రకాలుగా ఉంటాయి. తక్కువ తీవ్రత ఉన్నప్పుడు ‘బీ అవేర్ అలర్ట్’ జారీ చేస్తారు. మధ్యస్థ, అధిక తీవ్రత ఉన్నప్పుడు ‘టేక్ యాక్షన్ అలర్ట్’ ఇస్తారు. ఈ అలర్ట్ ద్వారా భూకంప తీవ్రత, ప్రభావిత ప్రాంతం వంటి వివరాలు చూపించి, సురక్షితంగా ఎలా ఉండాలో సూచనలు కూడా అందిస్తారు.
భారత్‌లో కూడా 2023 నుంచి ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 5.0 లేదా అంతకంటే పై వెర్షన్లలో ఈ ఫీచర్ పనిచేస్తుంది. అయితే ఈ అలర్ట్‌లు రావాలంటే మొబైల్ డేటా లేదా వైఫై ఆన్‌లో ఉండాలి. వినియోగదారులు కావాలనుకుంటే డివైజ్ సెట్టింగ్స్‌లో ఈ ఎర్త్‌క్వేక్ అలర్ట్‌లను ఆఫ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















