సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఆయన ప్రశంసించారు. ఏపీతో సింగపూర్ భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు.
ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌తో సోమవారం ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్–సింగపూర్ మధ్య సహకారం, పెట్టుబడుల అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
ఇటీవల సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం చేపట్టిన సింగపూర్ పర్యటనలో జరిగిన అంశాలను ఎడ్గర్ పాంగ్ ప్రస్తావించారు. ఆ పర్యటన ద్వారానే ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడినట్లు అభిప్రాయపడ్డారు.
మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో అమలవుతున్న “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానాన్ని వివరించారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం రాష్ట్రంలో ఉందని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల గ్రౌండింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు లోకేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం 750 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని, ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పారదర్శక విధానాలతో వేగంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
సింగపూర్‌తో బలమైన భాగస్వామ్యాన్ని తాము కోరుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే సింగపూర్ అధ్యయన యాత్రకు ఏపీ నుంచి ఉపాధ్యాయుల బృందం వెళ్లిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















