రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. మొదటి విడత కింద రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.2,482.02 కోట్లు జమ చేయనున్నారు.
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం నాలుగు గంటలకు రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ల్యాప్‌ట్యాప్‌లో బటన్ నొక్కి నిధులను అధికారికంగా విడుదల చేస్తారు.
ముందుగా ఈ సభను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర శాసనసభ నియోజకవర్గ పరిధిలోని చింతకానిలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే భారీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసి, సీఎం సూచనల మేరకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికకు మార్చారు.
రైతులకు పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, చిన్న రైతులకు ఆర్థిక భరోసా కల్పించడానికి ఈ నిధుల విడుదల కీలకంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















