ఫిఫా ప్రపంచ కప్ 2026లో స్పెయిన్ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్ 32లో ఆస్ట్రియాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. మైకెల్ 36వ, 89వ నిమిషాల్లో రెండు గోల్స్ చేయగా, పెడ్రో పొర్రో 66వ నిమిషంలో ఒక గోల్ చేసి స్పెయిన్ విజయానికి బాట వేశాడు.
ఈ మ్యాచ్‌లో స్పెయిన్ గోల్‌కీపర్ ఉనై సైమన్ అరుదైన రికార్డు సాధించాడు. ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా 519 నిమిషాల పాటు ప్రత్యర్థులకు గోల్ ఇవ్వకుండా అడ్డుకున్నాడు. దీంతో 1990 వరల్డ్ కప్‌లో ఇటలీ గోల్‌కీపర్ వాల్టర్ జెంగా నమోదు చేసిన 517 నిమిషాల రికార్డును అధిగమించాడు.
2022 వరల్డ్ కప్‌లో జపాన్‌పై 51వ నిమిషంలో గోల్ ఇచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉనై సైమన్ వరుసగా గోల్‌కి అవకాశం ఇవ్వలేదు. ఈ వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజ్‌లో స్పెయిన్ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక డ్రా సాధించి గ్రూప్ Hలో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రియాపై కూడా అతని అద్భుత ప్రదర్శన కొనసాగడంతో స్పెయిన్ విజయాన్ని నమోదు చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















