ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) ప్రధాన సమన్వయకర్త, సినీ దర్శకనటుడు సీమాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన విడుదల చేసిన ప్రకటనలో— చిత్రబృందం ఇటీవల చూపించిన కంటెంట్ కార్తికేయుడు తమిళుల దైవమని, ఆయన జన్మస్థలంపై వక్రీకరణలకు దారి తీసేలా ఉందని పేర్కొన్నారు. కల్పిత సృజన ముసుగులో చారిత్రక అంశాలను తప్పుదోవ పట్టించేలా చూపించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
సుబ్రహ్మణ్యస్వామి తమిళుల పురాతన ఆది దైవమని, ఆయనపై అనవసర వివాదాలు సృష్టించడం ఆమోదయోగ్యం కాదని సీమాన్ స్పష్టం చేశారు. ఇలాంటి కథనాలను చిత్రబృందం వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు.
లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తూ, తమ అభ్యంతరాలకు విరుద్ధంగా సినిమా రూపొందించి విడుదల చేస్తే తమిళనాడులో ప్రదర్శనను అడ్డుకుంటామని తెలిపారు. అలాగే తమిళ వెర్షన్‌తో పాటు తెలుగు వెర్షన్‌ను కూడా రాష్ట్రంలో విడుదల చేయకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















