లోకేశ్ కనగరాజ్ ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దర్శకుడిగా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం ఆయన ‘DC’ అనే సినిమాతో కథానాయకుడిగా వెండితెరపై కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు.
ఇక ఇదే సమయంలో ఆయన నిర్మాతగా కూడా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు సమాచారం. మహిళా ప్రధాన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విశాల్ వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా రెజీనా కసాండ్రాను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. త్వరలోనే చిత్రానికి సంబంధించిన టైటిల్, కథాంశం మరియు ఇతర వివరాలను అధికారికంగా ప్రకటించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోందని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















