నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై జరుగుతున్న నిరసనలకు దూరంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరించిన పలు యూనివర్సిటీల తీరుపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించేందుకు విద్యార్థులకు ప్రజాస్వామ్య హక్కు ఉందని పేర్కొన్నారు. నిరసనల్లో పాల్గొనవద్దని విద్యార్థులను హెచ్చరించడానికి యూనివర్సిటీలకు ఎంత ధైర్యమంటూ ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు సమయం వచ్చినప్పుడు ఆయా విశ్వవిద్యాలయాలు జవాబుదారీగా ఉండాల్సి వస్తుందని అన్నారు.
జంతర్‌మంతర్ వద్ద జరిగే నిరసనలకు వెళ్లవద్దని, అక్కడ ఆందోళనల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని దిల్లీ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఐఐటీ రూర్కీ, ఐఐటీ మద్రాస్ సహా పలు విద్యాసంస్థలు తమ విద్యార్థులకు సూచించాయి. నిరసనలకు సంబంధించిన పోస్టులను సోషల్ మీడియాలో కూడా చేయవద్దని కొన్ని యూనివర్సిటీలు హెచ్చరించాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే ఈ సూచనలు జారీ చేసినట్లు విద్యాసంస్థలు పేర్కొన్నాయి.
ఈ సర్క్యులర్లపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. విద్యార్థులు తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకుని ప్రభుత్వాన్ని, వ్యవస్థను ప్రశ్నించేందుకు అవకాశం ఉండాలని అన్నారు. విద్యార్థుల గొంతును అణచివేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
యూనివర్సిటీల తీరుపై పలువురి విమర్శలు
యూనివర్సిటీల హెచ్చరికలపై పలువురు ప్రముఖులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. దిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆ సంస్థ జారీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు ఎంపీ దీపేందర్ హుడా తెలిపారు. జంతర్‌మంతర్ వద్ద నిరసనలు చట్టవిరుద్ధమని ఎవరు ప్రకటించారని ప్రశ్నించారు.
విద్యార్థుల గొంతులను అణచివేస్తే వారి భద్రత మరింత ప్రమాదంలో పడుతుందని నటి, చిత్రనిర్మాత పూజాభట్ వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తుపై నిజంగా ఆందోళన ఉంటే.. మౌనం వహించకుండా వారి ప్రజాస్వామ్య హక్కులకు మద్దతుగా నిలవాలని ఆమె పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















