ఒకరోజు ఉదయం అక్బర్ చక్రవర్తి, బీర్బల్ తన రాజభవన తోటలో విహరిస్తున్నారు. తోటలోని చెట్లపై చాలా కాకులు అరుస్తూ ఎగురుతున్నాయి. అక్బర్ సరదాగా బీర్బల్‌ను పరీక్షించాలనుకుని, “బీర్బల్, మన రాజ్యంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయో చెప్పగలవా?” అని అడిగాడు. బీర్బల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, చిరునవ్వుతో “జహాంపనా! మన రాజ్యంలో ఖచ్చితంగా 95,463 కాకులు ఉన్నాయి” అని సమాధానం ఇచ్చాడు. అక్బర్ ఆశ్చర్యపోయి, “అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఒకవేళ నేను వాటిని లెక్కించినప్పుడు అంతకంటే ఎక్కువ లేదా తక్కువ ఉంటే?” అని ప్రశ్నించాడు. దానికి బీర్బల్ చాకచక్యంగా ఇలా అన్నాడు: “ప్రభూ! ఒకవేళ కాకుల సంఖ్య ఎక్కువ వస్తే… పక్క రాజ్యంలో ఉన్న తమ బంధువుల ఇంటికి చుట్టపుచూపుగా ఇక్కడికి వచ్చి ఉంటాయని అర్థం. ఒకవేళ తక్కువ వస్తే… మన రాజ్యంలో ఉన్న కాకులు పక్క రాజ్యంలో ఉన్న తమ బంధువులను చూడటానికి వెళ్లాయని అర్థం!” బీర్బల్ సమయస్ఫూర్తికి, తెలివైన సమాధానానికి అక్బర్ బాహాటంగా నవ్వి, అతనికి తగిన పారితోషికం ఇచ్చి మెచ్చుకున్నాడు.
నీతి: చిక్కు ప్రశ్నలు లేదా క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కంగారు పడకుండా సమయస్ఫూర్తి, చమత్కారం ఉపయోగిస్తే ఎలాంటి ప్రశ్లనైనా సులువుగా ఎదుర్కోవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews




















