హైదరాబాద్‌లో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి ఆస్ట్రేలియా పౌరులను లక్ష్యంగా చేసుకుని సుమారు రూ.100 కోట్ల మేర సైబర్ మోసాలకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు దేవరపల్లి పట్టాభిని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2025 నవంబరులో కేసు నమోదు కాగా, ఎనిమిది నెలలుగా పరారీలో ఉన్న అతడిని మాదాపూర్‌లో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామానికి చెందిన పట్టాభి.. తన సహచరులు ప్రవీణ్, ప్రకాశ్‌లతో కలిసి 2024లో హైటెక్‌సిటీలోని అయ్యప్ప సొసైటీలో ‘రిట్జ్ ఐటీ సొల్యూషన్స్’ పేరుతో కాల్‌సెంటర్‌ను ప్రారంభించాడు. ఖమ్మం, కోల్‌కతాకు చెందిన పలువురిని టెలీకాలర్లుగా నియమించి విదేశీయులకు నకిలీ ఈ-మెయిల్స్, ఫోన్‌కాల్స్ ద్వారా బ్యాంకింగ్, సాంకేతిక సమస్యల పేరుతో నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
దర్యాప్తులో ఈ ముఠా ప్రధానంగా ఆస్ట్రేలియా పౌరులనే లక్ష్యంగా చేసుకుని రెండు సంవత్సరాల కాలంలో దాదాపు రూ.100 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పట్టాభి అరెస్టుతో కీలక ఆధారాలు లభించాయని తెలిపారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, విదేశీ కనెక్షన్లు, మోసపూరిత నగదు బదిలీలపై మరింత లోతుగా విచారణ కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















