భారత క్రికెట్‌లో యువ ప్రతిభకు కొదవలేదని మరోసారి నిరూపిస్తున్నాడు 18 ఏళ్ల పేసర్ దీపేశ్ దేవేంద్రన్. ఇటీవల యువ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన వైభవ్ సూర్యవంశీకి సహచరుడైన దీపేశ్.. బ్యాట్‌తో కాకుండా బంతితో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.
అండర్-19 ప్రపంచకప్‌లో నిలకడైన పేస్‌తో ఆకట్టుకున్న దీపేశ్.. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో మధురై పాంథర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ట్రిచీ గ్రాండ్ చోళాస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఏకంగా గంటకు 146 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. అంతేకాదు, వరుసగా 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు.
దీపేశ్ వేగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువ పేసర్ బౌలింగ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత క్రికెట్‌లో పేస్ బౌలింగ్ విభాగంలో ఇటీవలి కాలంలో యువ ప్రతిభ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. దీపేశ్ కూడా భవిష్యత్తులో టీమిండియాకు ఉపయోగపడే బౌలర్‌గా ఎదగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















