అర్హులైన వారికి సామాజిక భద్రతా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం ‘చేయూత’ పథకం కింద కొత్త లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తోంది. తాజా మార్గదర్శకాల ప్రకారం అర్హుల జాబితాను సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపాలని జిల్లా, మండల స్థాయి అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
పంద్రాగస్టులోగా కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇప్పటికే వివిధ రకాల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది కొత్త మార్గదర్శకాలతో తమకు పింఛన్ లభిస్తుందన్న ఆశతో ఉన్నారు.
ఇప్పటివరకు పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులు, మరణించిన వారి వివరాలను పరిశీలించి పేర్లను తొలగించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇలా ఖాళీ అయ్యే స్థానాల్లో అర్హులైన కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రాధాన్య కేటగిరీలపై దృష్టి:
కొత్తగా మంజూరు చేయనున్న పింఛన్లలో ప్రత్యేక ప్రాధాన్య కేటగిరీలకు చెందిన వారికి ముందుగా అవకాశం కల్పించాలని మార్గదర్శకాల్లో సూచించినట్లు తెలుస్తోంది. దీర్ఘకాలిక వైకల్యాలు ఉన్న పిల్లలు, మస్క్యులర్ డిస్ట్రోపీ, వెన్నుపాము సంబంధిత సమస్యలు, ఆటిజం, కొన్ని రక్త సంబంధిత రుగ్మతలు ఉన్న దివ్యాంగులతో పాటు 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
అలాగే నిర్దిష్ట వయోపరిమితిలో ఉన్న వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు కూడా ప్రాధాన్య క్రమంలో పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారి వివరాలను నిర్ణీత ఫార్మాట్‌లో సమర్పించాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు సూచనలు జారీ అయ్యాయి. దీంతో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారుల్లో మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















