రైల్వే రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పురోగతి సాధిస్తోంది. రికార్డు స్థాయి ఆదాయంతో సౌత్ కోస్ట్ రైల్వే దేశంలోనే అత్యుత్తమ జోన్‌గా నిలిచిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. వార్షికంగా రూ.2,493 కోట్ల ఆదాయం సాధించినట్లు పేర్కొంది. తక్కువ సమయంలోనే సౌత్ కోస్ట్ రైల్వే తన సామర్థ్యాన్ని చాటుకుందని తెలిపింది.రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం రూ.54,000 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో కొనసాగుతుండగా, మరో రూ.71,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.
విశాఖపట్నం రైల్వే యార్డ్ ఆధునికీకరణకు రూ.300 కోట్లు మంజూరు చేయగా, గుంతకల్–బళ్లారి నాలుగు లైన్ల విస్తరణకు రూ.1,205 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. విజయవాడ డివిజన్ పరిధిలో 5 కొత్త రైల్వే మార్గాలు, 24 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొంది.
ప్రయాణికుల భద్రతకు ‘కవచ్’:
రైలు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రత కోసం 100 ఇంజిన్లలో ‘కవచ్’ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. 2026 చివరి నాటికి తొలి 100 కిలోమీటర్ల పరిధిలో కవచ్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.విశాఖపట్నం రైల్వే యార్డ్ పునర్నిర్మాణంలో భాగంగా 6 కొత్త ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి రానున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్‌లో భక్తుల రద్దీని నియంత్రించేందుకు రూ.20 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు.
స్టేషన్ల ఆధునికీకరణకు ప్రాధాన్యం:
రైల్వే ప్రమాదాలను తగ్గించేందుకు ఏపీ వ్యాప్తంగా 300కు పైగా రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు, రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు నిర్మిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ముందస్తు సమీక్షలు కూడా పూర్తిచేసినట్లు వెల్లడించింది.రాయనపాడు, మంగళగిరి సహా 70కి పైగా రైల్వే స్టేషన్లలో ‘అమృత్ భారత్’ పథకం కింద ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్, విశాఖపట్నం స్టేషన్‌లో డెక్కన్ ఛాయ్ వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర రైల్వే శాఖ పేర్కొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















