హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టును ఈగల్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. మియాపూర్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన రెండు కేసుల్లో మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి, సుమారు రూ.12.65 లక్షల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సులు, రైళ్లు, వ్యక్తిగత వాహనాల ద్వారా డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో రాజస్థాన్‌కు చెందిన క్యారియర్లు, డెలివరీ ఏజెంట్లు, మధ్యవర్తుల పాత్రను గుర్తించారు. మొత్తం కిలో ఓపియం, 25 గ్రాముల మెఫెడ్రీన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ ముఠా ఇప్పటివరకు సుమారు 78 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రాజస్థాన్‌కు చెందిన మహేందర్ మావత్‌ను కీలక సరఫరాదారుగా గుర్తించిన పోలీసులు.. అతడి నెట్‌వర్క్‌పై కూడా దృష్టి సారించారు.
మియాపూర్ కేసులో మధురామ్, మహేంద్ర పటేల్, ధర్మేంద్రను అరెస్టు చేయగా.. సైఫాబాద్ కేసులో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరికొందరు నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇదే సమయంలో ఎండీ డ్రగ్స్ తయారీకి ఉపయోగిస్తున్న స్థావరాలను గుర్తించిన ఈగల్ ఫోర్స్ వాటిని ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















