టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం కొత్త ఓటీటీ పాస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతో డేటాతో పాటు ప్రీమియం ఓటీటీ వినోదాన్ని అందించడమే లక్ష్యంగా త్రైమాసిక, వార్షిక వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌లను ప్రకటించింది.
రూ.200 ఓటీటీ పాస్:రూ.200తో లభించే ఈ పాస్‌కు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో 30 జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ 5జీ డేటా ప్రయోజనం లభిస్తుంది. ప్రైమ్ వీడియో మొబైల్ సహా ఓటీటీ ప్రయోజనాలను పొందవచ్చు. వాయిస్-ఓన్లీ ప్యాక్‌లు మినహా యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న జియో వినియోగదారులు ఈ పాస్‌ను పొందవచ్చు.
రూ.550 పాస్:రూ.550 ఓటీటీ పాస్‌తో 84 రోజుల వ్యాలిడిటీ, 90 జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ అందుతుంది. అమెజాన్ ప్రైమ్ లైట్‌తో పాటు ఓటీటీ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మూడు నెలలు లేదా ఏడాది బేస్ ప్లాన్ ఉన్న వినియోగదారులకు ఈ పాస్ అందుబాటులో ఉంటుంది.
రూ.2,000 వార్షిక పాస్:రూ.2,000తో తీసుకునే ఓటీటీ పాస్‌కు 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఏడాది పాటు 365 జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5జీతో పాటు అమెజాన్ ప్రైమ్ లైట్, ఇతర ఓటీటీ సేవలను పొందవచ్చు. అయితే ఈ పాస్ ఏడాది బేస్ ప్లాన్ ఉన్న వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.
జియో ప్రకారం.. ఈ ఓటీటీ పాస్‌ల ద్వారా వినియోగదారులకు ప్రతి నెలా సుమారు రూ.1,500 విలువైన ప్రయోజనాలు లభించనున్నాయి. మొత్తం 15 ప్రీమియం ఓటీటీ యాప్‌లతో పాటు జియోటీవీ ద్వారా 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను వీక్షించే సదుపాయం కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















