మరణశిక్ష అమలు చేసే విధానంపై దాఖలైన కీలక పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న ఉరిశిక్ష విధానానికి బదులుగా ప్రాణాంతక ఇంజెక్షన్ వంటి తక్కువ బాధ కలిగించే ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తాజాగా ధర్మాసనం కొట్టివేసింది. ప్రస్తుతానికి మరణశిక్ష అమలులో ఉరితీయడమే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
దోషికి సాధ్యమైనంత తక్కువ నొప్పి కలిగేలా, అతడి గౌరవాన్ని కాపాడే విధంగా మరణశిక్షను అమలు చేయాలని కోరుతూ న్యాయవాది రిషి మల్హోత్రా 2017లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రాణాంతక ఇంజెక్షన్, కాల్చి చంపడం, విద్యుత్ షాక్, గ్యాస్ చాంబర్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పిటిషన్‌లో ప్రస్తావించారు.
ఉరిశిక్ష అత్యంత బాధాకరమైన, క్రూరమైన ప్రక్రియగా మారే అవకాశం ఉందని పిటిషనర్ వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద గౌరవప్రదమైన మరణాన్ని పొందే హక్కును కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
పిటిషన్‌లోని వాదనల ప్రకారం.. ఉరి తీసిన తర్వాత మరణాన్ని నిర్ధారించేందుకు సుమారు 40 నిమిషాల వరకు సమయం పట్టే అవకాశం ఉండగా, ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా ఈ ప్రక్రియ సుమారు ఐదు నిమిషాల్లో పూర్తవుతుందని పేర్కొన్నారు. సాధ్యమైనంత తక్కువ బాధతో మరణశిక్ష అమలు చేయాలంటూ ఐక్యరాజ్యసమితి తీర్మానాలను కూడా పిటిషనర్ ప్రస్తావించారు.
అయితే ఈ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. గతంలో ఇదే అంశంపై వెలువడిన తీర్పులను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను కూడా అంగీకరించలేదు.
అదే సమయంలో ఈ అంశంపై భవిష్యత్తులో మార్పులకు అవకాశం లేకపోలేదని కోర్టు పేర్కొంది. మరణశిక్ష అమలుకు ప్రత్యామ్నాయ పద్ధతులు తక్కువ బాధను కలిగిస్తాయని నిరూపించే మెరుగైన శాస్త్రీయ ఆధారాలు అందుబాటులోకి వస్తే.. భవిష్యత్‌లో ఈ అంశాన్ని మళ్లీ పరిశీలించే అవకాశం ఉందని తెలిపింది.
మరణశిక్ష అమలులో ఉరికి బదులుగా ఇతర విధానాలను ఎంచుకునే అవకాశం దోషికి ఇవ్వాలన్న సూచనపై కేంద్ర ప్రభుత్వం గత విచారణల్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత విధానంలో ఉరితీయడమే కొనసాగించాలని కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















