పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం సామాన్య వినియోగదారులపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ కోల్గేట్-పామోలివ్ తన ఉత్పత్తుల ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. రానున్న త్రైమాసికాల్లో ధరల పెంపు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ముడిసరుకుల సరఫరా, వ్యయాలపై ప్రభావం పడుతోందని కంపెనీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులను భరించడంతో పాటు లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు ధరల పెంపు అవసరమవుతోందని కంపెనీ అభిప్రాయపడుతోంది.
కోల్గేట్-పామోలివ్ ఇండియా సీఈవో, ఎండీ ప్రభా నరసింహన్ మాట్లాడుతూ.. గతేడాది జీఎస్‌టీ సవరణ నేపథ్యంలో కొన్ని ఉత్పత్తుల బరువును పెంచినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.10, రూ.20 ధరలకే కొన్ని కోల్గేట్ ఉత్పత్తులను అందిస్తున్నామని చెప్పారు. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ముడిసరుకుల సరఫరాపై ప్రభావం పడుతోందని, ఖర్చులు పెరుగుతున్నాయని వివరించారు.
ఇప్పుడే ధరలను సర్దుబాటు చేయకపోతే భవిష్యత్తులో అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చని ప్రభా నరసింహన్ పేర్కొన్నట్లు కథనాలు తెలిపాయి. దీంతో రానున్న రోజుల్లో కోల్గేట్ టూత్‌పేస్ట్, ఇతర ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.
కోల్గేట్-పామోలివ్ టూత్‌పేస్ట్‌తో పాటు టూత్ బ్రష్ విభాగంలోనూ ప్రీమియం ఉత్పత్తులపై మరింత దృష్టి సారిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అధిక విలువ కలిగిన ఉత్పత్తుల ద్వారా మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది.
మరోవైపు కంపెనీకి చెందిన పర్సనల్ కేర్ బ్రాండ్ పామోలివ్ మార్కెట్ పనితీరుపై ప్రభా నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విభాగంలో మార్కెట్ వాటాను పెంచుకునేందుకు కంపెనీ చర్యలు చేపడుతోంది.
ఇందులో భాగంగా పామోలివ్ ఉత్పత్తుల మార్కెట్‌ను మరింత విస్తరించేందుకు బాంబే షేవింగ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రభా నరసింహన్ తెలిపారు. ప్రస్తుతం పామోలివ్ పతంజలి, హేలియోన్‌కు చెందిన సెన్సోడైన్, హిందూస్థాన్ యూనిలీవర్‌కు చెందిన పెప్సోడెంట్ వంటి బ్రాండ్లతో పోటీ పడుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















