హైదరాబాద్: నగరంలో కీలకమైన కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ చేపడుతున్న 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
ఎస్‌ఆర్‌డీపీ పనులు, వన్‌వే ఆంక్షల అమలును సీపీ సజ్జనార్ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో కలిసి స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం 15 పిల్లర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, వన్‌వే అమలుతో ఒకేసారి మరో 40 పిల్లర్లకు ఫౌండేషన్ వేసేందుకు అవసరమైన స్థలం, సౌకర్యం లభించిందని చెప్పారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ ఉదయం 6 గంటల నుంచి వన్‌వే విధానం అమలు చేస్తున్నారు. పీక్ అవర్స్‌లో రెండు, మూడు ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల ట్రాఫిక్ సాఫీగానే సాగిందని అధికారులు తెలిపారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
జాయింట్ సీపీ, డీసీపీల పర్యవేక్షణలో నాలుగు షిఫ్ట్‌లుగా మొత్తం 1000 మంది పోలీసులను బందోబస్తుకు కేటాయించారు. ట్రాఫిక్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట్ల వాహనాలను మళ్లిస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని అధికారులు కోరారు.
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్‌వే విధానం సుమారు ఏడాదిన్నర పాటు కొనసాగనుంది. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్ నంబర్ 45 మీదుగా ఐటీ కారిడార్‌కు వెళ్లే వాహనదారులు కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి బసవతారకం, ఫిల్మ్‌నగర్ మీదుగా రోడ్ నంబర్ 45కు చేరుకోవచ్చని తెలిపారు. అక్కడి నుంచి ఐటీ కారిడార్ వైపు ప్రయాణించవచ్చని సూచించారు.
రహదారికి ఇరువైపులా వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నందున వాహనదారులు ముందుగానే తమ ప్రయాణ మార్గాన్ని ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ మార్పులు ఉన్న ప్రాంతాల్లో పోలీసుల సూచనలు పాటించాలని కోరారు
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















