ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తగ్గించేందుకు 6,534 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల్లో రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలు, అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు :
- SGT: 3,597 పోస్టులు
- స్కూల్ అసిస్టెంట్: 2,937 పోస్టులు
- మొత్తం: 6,534 పోస్టులు
అర్హతలు :
SGT: ఇంటర్మీడియట్‌తో పాటు రెండేళ్ల డీఎడ్ పూర్తి చేసి ఉండాలి.
స్కూల్ అసిస్టెంట్: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. TET, DSCలో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
గౌరవ వేతనం :
- SGTలకు నెలకు రూ.10,000
- స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులను ఆగస్టు 21లోగా సంబంధిత MEO కార్యాలయంలో ఆఫ్‌లైన్‌లో సమర్పించాలి. ఆగస్టు 23 నుంచి 28 వరకు దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. ఆగస్టు 29న తుది మెరిట్ జాబితా ప్రకటిస్తారు. ఆగస్టు 30, 31 తేదీల్లో నియామక పత్రాలు అందజేస్తారు. సెప్టెంబర్ 1 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది.
ఈ నియామకాలు 2026–27 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తాయి. ఎంపికైన వారు 2026 సెప్టెంబర్ 1 నుంచి 2027 ఏప్రిల్ 30 వరకు సేవలు అందించాల్సి ఉంటుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















