జేన్‌స్ట్రీట్‌కు ఈ పరిణామం మరోసారి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. భారత మార్కెట్‌లో ట్రేడింగ్ విధానాలపై సెబీ చర్యలు ఎదుర్కొన్న ఈ సంస్థ.. అమెరికాలో తాను పెట్టుబడి పెట్టిన హెడ్జ్‌ఫండ్ పతనంతో భారీగా నష్టపోయినట్లు సమాచారం. ముఖ్యంగా సెమీకండక్టర్ రంగంలోని షేర్లపై భారీగా పెట్టుబడులు పెట్టడం సిట్యువేషనల్ అవేర్‌నెస్‌కు ప్రతికూలంగా మారింది.
శాన్‌డిస్క్, మైక్రాన్ టెక్నాలజీ వంటి షేర్లు ఒక్క నెలలోనే భారీగా పతనం కావడంతో ఫండ్ పోర్ట్‌ఫోలియో విలువ వేగంగా కరిగిపోయింది. వీటితో పాటు బ్లూమ్ ఎనర్జీ, టీఎస్‌ఎంసీ, నెబియస్ వంటి కంపెనీల్లోని పెట్టుబడులు కూడా నష్టాలను మిగిల్చాయి. ఫలితంగా ఫండ్ మొత్తం విలువ భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది.
ఈ హెడ్జ్‌ఫండ్‌లో జేన్‌స్ట్రీట్‌కు ఉన్న పెట్టుబడుల విలువ కూడా గణనీయంగా తగ్గింది. ఫండ్ నష్టాల ప్రభావంతో జేన్‌స్ట్రీట్ దాదాపు 15 బిలియన్ డాలర్ల మేర నష్టపోయినట్లు సమాచారం. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1.25 లక్షల కోట్లకు సమానం. అయితే, ఈ నష్టం జేన్‌స్ట్రీట్ స్వయంగా ట్రేడింగ్‌లో నష్టపోయినది కాకుండా.. అది పెట్టుబడి పెట్టిన హెడ్జ్‌ఫండ్ పతనం కారణంగా వాటిల్లినదిగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, భారత స్టాక్ మార్కెట్‌లో జేన్‌స్ట్రీట్‌పై గతంలో సెబీ తీవ్ర చర్యలు తీసుకుంది. ఇండెక్స్ ధరలను ప్రభావితం చేసే విధానాల ద్వారా అక్రమంగా లాభాలు ఆర్జించిందనే ఆరోపణలపై సంస్థపై చర్యలు చేపట్టింది. దాదాపు రూ.44,358 కోట్ల అక్రమ లాభాలు ఆర్జించినట్లు సెబీ గుర్తించగా.. నష్టాలను సర్దుబాటు చేసిన తర్వాత నికర అక్రమ లాభం రూ.36,671 కోట్లుగా పేర్కొంది. ఈ వ్యవహారంలో రూ.4,843 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
అలా భారత్‌లో నియంత్రణ సంస్థ చర్యలను ఎదుర్కొన్న జేన్‌స్ట్రీట్‌కు.. ఏడాది వ్యవధిలోనే అమెరికాలో పెట్టుబడి రూపంలో భారీ దెబ్బ తగలడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















