‘డాన్ 3’ సినిమా వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఈ వ్యవహారంలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA)కు ఆయన టీమ్ లీగల్ నోటీసులు పంపింది. ఈ వివాదంలో అసోసియేషన్ జోక్యం చేసుకోవద్దని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇటీవల IMPPA నిర్వహించిన సమావేశంలో రణ్‌వీర్ టీమ్ ఈ నోటీసులను అందించినట్లు తెలుస్తోంది. ‘డాన్ 3’ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రణ్‌వీర్‌కు ఎలాంటి తుది ఒప్పందం జరగలేదని ఆయన తరఫు న్యాయవాదులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ వివాదం IMPPA పరిధిలోకి రాదని, దీనిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం న్యాయస్థానాలకే ఉందని పేర్కొన్నారు.
మరోవైపు దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిధ్వానీలు రణ్‌వీర్‌పై రూ.45 కోట్ల నష్టపరిహారం కోరుతూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి రణ్‌వీర్ తరఫున కూడా కౌంటర్ దాఖలైంది. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం మరింత తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది.
2023 ఆగస్టులో ‘డాన్ 3’ను ప్రకటించిన సమయంలో సినిమాకు సంబంధించిన కథ, పాత్రలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ తర్వాత కథలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోవడం, నిర్మాణ ప్రక్రియ ఆలస్యం కావడం వంటి కారణాలతో రణ్‌వీర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ వ్యవహారం వివాదంగా మారింది.
ప్రస్తుతం IMPPAకు రణ్‌వీర్ టీమ్ పంపిన నోటీసులతో ‘డాన్ 3’ వివాదం మరోసారి బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం చివరకు న్యాయస్థానాల వరకు వెళ్తుందా? లేక ఇరు వర్గాలు చర్చల ద్వారా పరిష్కరించుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















