ముంబయి లోకల్ రైలులో ఓ యువతి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రైలు లోపల తీవ్ర రద్దీ ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయిన ఆమె.. తలుపు వద్ద నిల్చొని ఇనుప కడ్డీలను పట్టుకుని బయటకు వేలాడుతూ ప్రయాణించింది.
వీడియోలో యువతి రైలు తలుపు బయటకు శరీరాన్ని వంచి పట్టుకుని ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక దశలో రైల్వే బ్రిడ్జిపై ఉన్న ఇనుప గ్రిల్స్ ఆమెకు అత్యంత సమీపంగా రావడం కనిపించడంతో ఈ దృశ్యం చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం అప్రమత్తత కోల్పోయినా తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో పలువురు స్పందిస్తూ.. ‘రైలు దొరుకుతుంది.. కానీ ప్రాణం పోతే తిరిగి రాదు’ అంటూ యువతిని హెచ్చరిస్తున్నారు. రద్దీ కారణంగా ప్రయాణం ఆలస్యమైనా ఫర్వాలేదని, ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేలా రైలు తలుపుల వద్ద వేలాడటం లేదా ఫుట్‌బోర్డుపై నిలబడటం సరికాదని సూచిస్తున్నారు.
ముంబయి నగర రవాణాలో లోకల్ రైళ్లు అత్యంత కీలకమైనవి. ప్రతిరోజూ లక్షలాది మంది వీటిపై ఆధారపడుతుంటారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో రైలు ఎక్కేందుకు ప్రయాణికులు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో తలుపుల వద్ద నిలబడటం, ఫుట్‌బోర్డుపై ప్రయాణించడం వంటి ప్రమాదకర చర్యలు తరచూ ఆందోళనకు కారణమవుతున్నాయి.
రైలు నిండుగా ఉన్న సమయంలో ప్రయాణికులు తొందరపడకుండా తదుపరి రైలును ఎంచుకోవాలని, భద్రతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇవ్వాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















