ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పథకం ద్వారా భారీ అవకాశం లభిస్తోంది. దేశవ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులను ఈ పథకం కింద ఎంపిక చేయనున్నారు.
ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ పరీక్షకు హాజరుకావచ్చు. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు నాలుగేళ్ల పాటు ప్రతి నెలా రూ.1,000 చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అందుతుంది. అంటే నాలుగేళ్లలో మొత్తం రూ.48,000 వరకు లభిస్తుంది.
ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.5 లక్షలకు మించకూడదు. 7వ తరగతిలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కనీస మార్కుల పరిమితి 50 శాతంగా ఉంది.
ప్రైవేటు పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు, ప్రభుత్వ గురుకులాలు, వసతి సౌకర్యం కలిగిన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించదు.
పరీక్ష విధానం :
స్కాలర్‌షిప్ కోసం మొత్తం 180 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 180 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్షను రెండు భాగాలుగా నిర్వహిస్తారు. ఒక్కో భాగంలో 90 ప్రశ్నలు ఉండగా, ఒక్కో పరీక్షకు 90 నిమిషాల సమయం కేటాయిస్తారు.
పార్ట్-1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. ఇందులో వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్, అనాలజీ, క్లాసిఫికేషన్, న్యూమరికల్ సిరీస్, ప్యాటర్న్ పర్సెప్షన్, హిడెన్ ఫిగర్స్ తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
పార్ట్-2లో స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సైన్స్, సోషల్, మ్యాథ్స్ ప్రశ్నలు 7, 8 తరగతుల సిలబస్ ఆధారంగా ఉంటాయి.
జనరల్ అభ్యర్థులు రెండు విభాగాల్లోనూ కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 32 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు. అర్హత సాధించిన విద్యార్థుల్లో మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన తుది ఎంపిక జరుగుతుంది.
దేశవ్యాప్తంగా కేటాయించిన లక్ష స్కాలర్‌షిప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 4,087, తెలంగాణకు 2,921 స్కాలర్‌షిప్పులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులకు నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
స్కాలర్‌షిప్ కొనసాగాలంటే..
ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ప్రతి నెలా రూ.1,000 చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ సాయం నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది. అయితే ప్రతి తరగతిలోనూ నిర్దేశిత విద్యా ప్రమాణాలను సాధించాల్సి ఉంటుంది.
10వ తరగతిలో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 55 శాతం మార్కులు అవసరం. అనంతరం ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సులో చేరిన విద్యార్థులకే స్కాలర్‌షిప్ కొనసాగుతుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















