అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ యువ పైలట్ ప్రదర్శించిన అసాధారణ సమయస్ఫూర్తి, ధైర్యం అందరినీ ఆకట్టుకుంది. విమానంలో అకస్మాత్తుగా ఇంజిన్ సమస్య తలెత్తడంతో.. జనసాంద్రత ఉన్న ప్రాంతంలో అత్యవసర ల్యాండింగ్ చేయకుండా విమానాన్ని సముద్రంలోకి మళ్లించి ఆమె సురక్షితంగా బయటపడింది.
‘న్యూయార్క్ పోస్ట్’ కథనం ప్రకారం.. 23 ఏళ్ల ఫెయిత్ టెన్‌క్లే తన కుటుంబానికి చెందిన సింగిల్ ఇంజిన్ ‘పైపర్ PA-30’ విమానంలో ఫోర్ట్ మేయర్స్ నుంచి బహమాస్‌కు బయలుదేరారు. అక్కడ ఉన్న తన తల్లిదండ్రులను తీసుకురావడానికి ఆమె ప్రయాణం ప్రారంభించారు.
ప్రయాణం మధ్యలో విమానంలో అకస్మాత్తుగా ఇంజిన్ సమస్య తలెత్తింది. దీంతో పరిస్థితిని వెంటనే అర్థం చేసుకున్న ఫెయిత్ అత్యవసర ల్యాండింగ్‌కు సిద్ధమయ్యారు. అయితే ఫ్లోరిడాలోని బోకా రాటన్ బీచ్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతాలు కనిపించడంతో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు.
భవనాలు, బీచ్‌లో ఉన్న పర్యాటకులను తప్పిస్తూ విమానాన్ని అట్లాంటిక్ మహాసముద్రం వైపు మళ్లించారు. అనంతరం విమానాన్ని సముద్రంలో సురక్షితంగా దించారు. విమానం సముద్రంలో పడటాన్ని చూసిన బీచ్ సందర్శకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
విమానం సముద్రంలో ల్యాండ్ అయిన వెంటనే ఫెయిత్ అందులో నుంచి బయటకు వచ్చి ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెకు సహాయం అందించారు.
వైద్య పరీక్షల్లో ఫెయిత్‌కు ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదని నిర్ధారించారు. జనసమూహం ఉన్న బీచ్ ప్రాంతాన్ని తప్పించి సముద్రం వైపు విమానాన్ని మళ్లించడం ద్వారా ఆమె మరింత పెద్ద ప్రమాదాన్ని నివారించారని పలువురు ప్రశంసిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రమాదకర పరిస్థితుల్లోనూ ఫెయిత్ ప్రదర్శించిన ధైర్యం, సమయస్ఫూర్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















