విజయనగరం కంటోన్మెంట్: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగరం ప్రజల కొంగుబంగారంగా కొలిచే శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాలకు తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆలయ ఈవో శిరీష సోమవారం ఉత్సవాల షెడ్యూల్ను ప్రకటించారు. సిరిమాను పూజారి వెంకట్రావు, ఆలయ పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ప్రతి ఏటా వైభవంగా జరిగే పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అమ్మవారి దీక్షల ప్రారంభం నుంచి సిరిమాను ఉత్సవం, తెప్పోత్సవం, కలశ జ్యోతి ఊరేగింపు, ఉయ్యాల కంబాల మహోత్సవం వరకు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.
ఉత్సవాల తేదీలు :
అక్టోబర్ 1: అమ్మవారి చదురు వనం గుడిలో మండల దీక్షలు ప్రారంభం
అక్టోబర్ 22: అర్ధమండల దీక్షలు ప్రారంభం
అక్టోబర్ 26: తోలేళ్ల ఉత్సవం
అక్టోబర్ 27: సిరిమాను ఉత్సవం
నవంబర్ 3: పెద్ద చెరువులో తెప్పోత్సవం
నవంబర్ 7: కలశ జ్యోతి ఊరేగింపు
నవంబర్ 10: ఉయ్యాల కంబాల మహోత్సవం
నవంబర్ 11: చండీ హోమం, పూర్ణాహుతి, దీక్ష విరమణ
సిరిమాను ఉత్సవం పైడితల్లి అమ్మవారి జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు విజయనగరానికి తరలివచ్చే అవకాశం ఉంది. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















