ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు ఏఐ సేవలను మరింత చేరువ చేస్తోంది. చాటింగ్ సమయంలోనే మెటా ఏఐ సాయంతో సమాచారం తెలుసుకోవడం, మెసేజ్‌ల సారాంశం పొందడం, ఇమేజ్‌లు, స్టిక్కర్లు రూపొందించడం వంటి పనులు చేసుకోవచ్చు. టెక్స్ట్ కమాండ్లతోనే పలు పనులను సులభంగా పూర్తి చేసేలా ఈ ఫీచర్లను అందిస్తోంది.
చాట్‌లోనే ఏఐ సాయం :
పర్సనల్ లేదా గ్రూప్ చాట్‌లో ఉన్నప్పుడే మెటా ఏఐని ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం చాట్‌లో @Meta AIని ట్యాగ్ చేసి ప్రశ్న అడగాలి. ఉదాహరణకు ఓ గ్రూప్‌లో పండుగ తేదీపై చర్చ జరుగుతున్నప్పుడు.. ఆ తేదీని ఏఐని ట్యాగ్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే గ్రూప్‌లో మనం చూడని సందేశాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటి సారాంశాన్ని కూడా ఏఐ ద్వారా పొందే అవకాశం ఉంటుంది.
టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు :
యూజర్లు తమకు కావాల్సిన చిత్రాన్ని టెక్స్ట్ రూపంలో వివరించి ఇస్తే ఏఐ దానికి అనుగుణంగా ఇమేజ్‌ను రూపొందిస్తుంది. అంతేకాదు.. వివిధ సందర్భాలు, భావోద్వేగాలకు అనుగుణంగా ప్రత్యేకమైన స్టిక్కర్లను కూడా తయారు చేసుకోవచ్చు. దీంతో సాధారణ స్టిక్కర్లకు భిన్నంగా తమకు నచ్చిన వాటిని సృష్టించుకునే అవకాశం ఉంటుంది.
ఫొటోలకు ఏఐ ఎడిటింగ్ :
వాట్సాప్‌లో అప్‌లోడ్ చేసిన ఫొటోలను ఏఐ సాయంతో ఎడిట్ చేసుకోవచ్చు. ఫొటోలోని వస్తువులు, ప్రదేశాలు తదితర అంశాల గురించి సమాచారం అడగడంతో పాటు.. అవసరమైన వస్తువులను తొలగించమని ఏఐని ఆదేశించవచ్చు. ప్రొఫైల్ ఫొటోలను కూడా ఏఐ సాయంతో మార్చుకునే సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి.
ప్రైవేట్ చాట్ మోడ్:
ఏఐతో జరిపే సంభాషణల గోప్యత కోసం వాట్సాప్ ప్రైవేట్ చాట్ మోడ్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. దీని ద్వారా ఏఐతో చేసే సంభాషణలను ప్రైవేట్‌గా ఉంచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏఐ ఫీచర్ల లభ్యత యాప్ వెర్షన్, ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. కొన్ని సదుపాయాలను దశలవారీగా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















