రక్షాబంధన్ అంటే సాధారణంగా తోబుట్టువుల మధ్య ప్రేమ, అనుబంధానికి ప్రతీక. అయితే ఝార్ఖండ్‌లో ఈ పండగకు పర్యావరణ పరిరక్షణను జోడించారు. అడవులను కాపాడటమే లక్ష్యంగా ఈసారి వేలాది మంది గ్రామస్థులు చెట్లకు రాఖీలు కట్టేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం రాష్ట్రంలోని సుమారు 700 గ్రామాల్లో దాదాపు లక్ష చెట్లకు రాఖీలు కట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
‘సేవ్ ట్రీ’ ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ తాము రాఖీ కట్టిన చెట్టును కాపాడతామని ప్రతిజ్ఞ చేయనున్నారు. కేవలం ఒకరోజుతో కార్యక్రమాన్ని ముగించకుండా నెల రోజుల పాటు కొనసాగించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 24 జిల్లాల్లో సుమారు మూడు లక్షల చెట్లకు రాఖీలు కట్టాలని అటవీశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
గుమ్లా జిల్లా జోరాడ్‌లో అటవీశాఖ అధికారి సంజీవ్ కుమార్ చెట్టుకు రాఖీ కట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆయన ఆలోచనతోనే 2004లో ధన్‌బాద్ జిల్లాలో ఈ వినూత్న కార్యక్రమానికి తొలిసారి శ్రీకారం చుట్టారు. చెట్లను కేవలం ప్రకృతిలో భాగంగా కాకుండా కుటుంబ సభ్యుల్లా భావించి వాటిని సంరక్షించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కాలక్రమేణా ఈ ఆలోచన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పటివరకు ఝార్ఖండ్‌లోని 12 వేలకు పైగా గ్రామాలు ఈ కార్యక్రమంతో అనుసంధానమయ్యాయి. రాఖీ కట్టడం ద్వారా చెట్లను రక్షించాలనే బాధ్యతను ప్రజల్లో పెంపొందించడంతో పాటు అడవుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















