ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు ఆరోపించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో నిర్వహించిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు, హైదరాబాద్ సిటీ ఉద్యోగుల మహాధర్నాలో ఐకాస ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబరు 1న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నల్లరిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఐకాస ప్రకటించింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబరు 10న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమంతో నగరాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించింది.
మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఉన్న గౌరవంతో ఇంతకాలం సంయమనం పాటించామని తెలిపారు. మంత్రిమండలి ఉపసంఘం, మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి సమస్యలను వివరించినా పరిష్కారం లభించలేదని అన్నారు.
కరవుభత్యం (డీఏ) బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నూతన ఆరోగ్య బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న సీపీఎస్ రద్దు అంశాన్ని పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.
ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఆర్‌సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపుల కోసం పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేదని విమర్శించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ ఐకాస పిలుపు మేరకు ఉద్యోగులు కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















