నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇప్పటివరకు 547 మంది మృతదేహాలను వెలికితీసినట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 1,473 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.నేపాల్ వరదల్లో 320 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియలేదని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. మరోవైపు చైనా వైపు చిక్కుకున్న 400 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది.వారిలో 96 మంది రోడ్డు మార్గం ద్వారా సురక్షితంగా నేపాల్‌లోకి చేరుకున్నారని, మరో 21 మంది కాఠ్‌మాండూ నుంచి దిల్లీకి చేరుకున్నారని విదేశాంగ శాఖ పేర్కొంది.
వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన మృతదేహాల కోసం నదీ పరివాహక ప్రాంతాల్లో గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో నాలుగు, కుషీనగర్ జిల్లాలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఈ మృతదేహాలు నేపాల్ నుంచి కొట్టుకొచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. వాటి గుర్తింపుపై నేపాల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మహారాజ్‌గంజ్ జిల్లా మెజిస్ట్రేట్ గౌరవ్ సింగ్ సోగార్వాల్ తెలిపారు.
టిబెట్‌లోని చైనా-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఆకస్మిక వరదలు భారీ నష్టాన్ని కలిగించాయి. గీరోంగ్ కౌంటీలో 558 మంది గల్లంతైనట్లు చైనా అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు తెలిపారు.గల్లంతైన వారిలో 260 మంది విదేశీయులు ఉన్నప్పటికీ వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు.
టిబెట్ వైపున ఉన్న ఓ సరస్సు కట్టలు తెంచుకుని ప్రవహించే అవకాశం ఉందని నేపాల్ అధికారులు హెచ్చరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్న బృందాలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















