కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఓపెన్ఏఐ.. భారత మార్కెట్‌పై మరింత దృష్టి సారించింది. చాట్‌జీపీటీ ద్వారా కొత్త ఆదాయ మార్గాలను అందుబాటులోకి తీసుకొస్తూ భారత్‌లో ప్రకటనల ప్రదర్శనను ప్రారంభించింది. ఫ్రీ వెర్షన్‌తో పాటు నెలకు రూ.399 చెల్లించే ‘చాట్‌జీపీటీ గో’ ప్లాన్ వినియోగదారులకు సంభాషణల్లో స్పాన్సర్డ్ ప్రకటనలు కనిపించనున్నాయి.
అయితే చెల్లింపు ఆధారిత ప్లస్, ప్రో, బిజినెస్, ఎంటర్ప్రైజ్, ఎడ్యుకేషన్ ప్లాన్లు ఉపయోగించే వారికి ఎలాంటి ప్రకటనలు చూపించబోమని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది.
వినియోగదారుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని యాడ్స్ వ్యవస్థను ప్రత్యేకంగా రూపొందించినట్లు సంస్థ తెలిపింది. వినియోగదారులు అడిగే ప్రశ్నలకు చాట్‌జీపీటీ ఇచ్చే సమాధానాలపై ప్రకటనలు ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొంది.
ప్రతి ప్రకటనను స్పష్టంగా ‘స్పాన్సర్డ్’ అనే గుర్తుతో చూపిస్తామని తెలిపింది. ప్రకటనదారులకు వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, చాట్ హిస్టరీ, మెమరీస్ వంటి వివరాలు అందుబాటులో ఉండవని వెల్లడించింది.
18 ఏళ్ల లోపు వినియోగదారులకు ప్రకటనలు కనిపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఓపెన్ఏఐ తెలిపింది. ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, రాజకీయాలు వంటి సున్నితమైన అంశాలపై జరిగే సంభాషణల్లో కూడా ప్రకటనలను నిలిపివేయనున్నట్లు పేర్కొంది.
భారత్‌లోని స్థానిక వ్యాపారాలకు డిజిటల్ ప్రకటనల అవకాశాలను విస్తరించేందుకు చాట్‌జీపీటీ యాడ్స్ మేనేజర్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వ్యాపార సంస్థలు రోజుకు రూ.725 ప్రారంభ బడ్జెట్‌తో ప్రకటనలు ఇవ్వగలవు.
మొదటి దశలో డబ్ల్యూపీపీ, ఓమ్నికామ్ వంటి ప్రముఖ మార్కెటింగ్ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. ప్రారంభ దశలోనే 50కి పైగా ప్రముఖ బ్రాండ్లు చాట్‌జీపీటీ ప్రకటనల వేదికపై ఆసక్తి చూపుతున్నట్లు సంస్థ వెల్లడించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మార్కెట్లలో ఒకటైన భారత్‌లో చాట్‌జీపీటీకి భారీ వినియోగదారుల ఆధారం ఉంది. పెరుగుతున్న ఏఐ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారాలు, బ్రాండ్లు తమ వినియోగదారులను చేరుకునేందుకు చాట్‌జీపీటీని కొత్త ప్రచార వేదికగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















