తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారి వంతెన వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై నలుగురు యువకులు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకులను గమనించిన పోలీసులు వారిని ప్రశ్నించగా.. ఒక్కసారిగా కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
సోమవారం తెల్లవారుజామున సుమారు 5.30 గంటల సమయంలో విశాఖపట్నం నుంచి పల్నాడు జిల్లా దాచేపల్లికి సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ.. యర్నగూడెం వంతెన వద్ద ఆయిల్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. సమాచారం అందుకున్న కానిస్టేబుళ్లు వెంకటేశ్వరరావు, లోవరాజు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.
అదే సమయంలో అక్కడ నలుగురు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారి వద్దకు వెళ్లి వివరాలు అడిగారు. వారు అక్కడ ఎందుకు ఉన్నారని, బ్యాగుల్లో ఏముందో ప్రశ్నించారు. దీంతో ఆ యువకులు ఒక్కసారిగా బ్యాగులో ఉన్న కత్తిని బయటకు తీసి కానిస్టేబుల్ వెంకటేశ్వరరావుపై దాడి చేశారు. కత్తితో రెండుసార్లు పొడవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే మరో కానిస్టేబుల్ లోవరాజు కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి బైక్‌లపై పరారైనట్లు తెలుస్తోంది. గాయపడిన వెంకటేశ్వరరావును చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ నరసింహకిశోర్ పరామర్శించారు.
మరోవైపు యర్నగూడెం వంతెన పక్క నుంచి గ్రామంలోకి వెళ్లే రోడ్డును ఆనుకుని ఉన్న కనకదుర్గ ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని గ్రామస్థులు గుర్తించారు. కానిస్టేబుల్‌పై దాడి, ఆలయంలో చోరీ ఘటనలు ఒకేసారి వెలుగులోకి రావడంతో పోలీసులు ఈ రెండు ఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















