ఆటగాళ్ల గాయాలు, ఫిట్‌నెస్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకున్న వెంటనే ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయడం.. ఆ తర్వాత వారు పూర్తిస్థాయిలో మ్యాచ్ ఆడకుండానే తిరిగి గాయపడటంపై ఇటీవల తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ కొత్త విధానాన్ని అనుసరిస్తున్నట్లు సమాచారం.
అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది. ఈ జాబితాలో నితీశ్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా ఉన్నారు. అయితే వీరి ఫిట్‌నెస్‌పై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
కేవలం ఫిట్‌గా ఉన్నారని భావించడం కాకుండా.. పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉన్నారని నిర్ధారణ అయిన తర్వాతే మ్యాచ్ ఆడించాలని సీవోఈకి బీసీసీఐ స్పష్టమైన సూచనలు చేసినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. బోర్డు వర్గాల ప్రకారం, ఆటగాడు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని వైద్య, ఫిట్‌నెస్ బృందాలు నిర్ధరించిన తర్వాతే అతడిని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించినట్లు సమాచారం.
ఇటీవల భారత జట్టులో పలువురు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా మ్యాచ్‌లకు దూరమవుతున్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన కొందరు ఆటగాళ్లు పూర్తి స్థాయిలో మ్యాచ్ ఆడకుండానే మళ్లీ గాయపడటం బీసీసీఐపై విమర్శలకు దారితీసింది.
దీంతో సెలక్షన్ కమిటీతోపాటు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పనితీరుపైనా ప్రశ్నలు తలెత్తాయి. ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్‌లో గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. దీంతో అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. రాబోయే ఆసియా క్రీడలకు హార్దిక్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నప్పటికీ.. అప్పటికీ పూర్తి ఫిట్‌గా ఉంటేనే అతడిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
అక్టోబర్‌లో న్యూజిలాండ్ పర్యటనకు టీమ్‌ఇండియా వెళ్లనుంది. ఈ పర్యటనకు ముందు భారత్-ఎ జట్టు న్యూజిలాండ్-ఎతో మూడు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. రెండు టెస్టుల సిరీస్‌కు ఈ మ్యాచ్‌లను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు భావిస్తున్నాయి.
న్యూజిలాండ్‌తో భారత్ అక్టోబర్ 22 నుంచి టీ20 సిరీస్‌లో పాల్గొననుంది. అనంతరం వన్డేలు, టెస్టులు కూడా జరగనున్న నేపథ్యంలో భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్ కీలకంగా మారింది. వరుసగా మ్యాచ్‌లు ఉండటంతో గాయాల విషయంలో బీసీసీఐ మరింత అప్రమత్తంగా వ్యవహరించనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















