భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్‌లో అసాధారణ ప్రతిభ ఉందని, అతడిని సరైన మార్గంలో తీర్చిదిద్దితే భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్‌లో సూపర్‌స్టార్‌గా ఎదుగుతాడని పేర్కొన్నాడు.
వైభవ్ ఆటకు ఇప్పుడు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరుగుతోందని శ్రీకాంత్ చెప్పాడు. చివరకు తన భార్య కూడా వైభవ్ ఆడుతున్నాడనే దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లను చూస్తోందని ఆసక్తికరంగా వెల్లడించాడు. రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ పేసర్లను ఏమాత్రం భయపడకుండా భారీ షాట్లు ఆడటం అతడి ప్రత్యేకత అని ప్రశంసించాడు.
అన్ని ఫార్మాట్లలోనూ రాణించే సామర్థ్యం వైభవ్‌కు ఉందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. దేశవాళీ క్రికెట్‌లో అతడి ఆటను చూసిన తర్వాత ఉన్నతస్థాయి క్రికెట్ ఆడగలడా? అనే సందేహాలకు తావే లేదని స్పష్టం చేశాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















