స్కూల్ దశలోనే భవిష్యత్ కెరీర్‌పై అవగాహన పెంచుకోవాలనుకునే విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ ‘స్కూల్ కనెక్ట్’ కార్యక్రమం ద్వారా ప్రత్యేక అవకాశాన్ని అందిస్తోంది. 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్, లా, ఫోరెన్సిక్ సైన్స్ వంటి విభిన్న రంగాలకు సంబంధించిన ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులను చేసుకోవచ్చు.
ఈసారి మొత్తం 19 కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో కోర్సు ఎనిమిది వారాల పాటు కొనసాగుతుంది. రికార్డెడ్ పాఠాలతో పాటు నిపుణులైన అధ్యాపకులతో లైవ్ ఇంటరాక్షన్ సెషన్స్ కూడా ఉంటాయి. టెక్నాలజీతో పాటు మ్యాథ్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్, హ్యుమానిటీస్, ఎకాలజీ, గేమ్ టెక్నాలజీ వంటి విభిన్న అంశాలపై కూడా కోర్సులు ఉన్నాయి.
కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఐఐటీ మద్రాస్ – సెంటర్ ఫర్ అవుట్‌రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ (CODE) తరఫున ఈ-సర్టిఫికెట్లు అందిస్తారు. కోర్సు మధ్యలో నిర్వహించే అసెస్మెంట్లు, ఫైనల్ పరీక్షతో పాటు ప్రాజెక్టు ఆధారంగా పార్టిసిపేషన్, కోర్సు కంప్లీషన్, టేక్ హోం ప్రాజెక్ట్ సర్టిఫికెట్లను పొందే అవకాశం ఉంటుంది.
ప్రతి కోర్సుకు రూ.500 ఫీజు నిర్ణయించారు. అక్టోబర్ 5 నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభం కానుండగా.. దరఖాస్తులకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉంది. అయితే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులే అర్హులు. తమ పాఠశాల ‘స్కూల్ కనెక్ట్’లో భాగస్వామిగా ఉందో లేదో విద్యార్థులు ముందుగా తెలుసుకోవాలి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















