ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో యుద్ధాన్ని కొనసాగించాలని తమ ప్రభుత్వం కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే తమ దేశంపై అగ్రరాజ్యం ఒత్తిడి పెంచినా లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
యుద్ధాన్ని ఎలా, ఎప్పుడు ముగించాలనే అంశంపై ఇరాన్, అమెరికా మధ్య ఏకాభిప్రాయం లేదని పెజెష్కియాన్ తెలిపారు. యుద్ధం ముగింపు నిర్ణయం అమెరికా వైఖరిపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఇరాన్‌లోని ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపుతూ అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ నాయకులు తమ దేశంలో అశాంతిని పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇరాన్‌కు, అమెరికాకు మధ్య సైనిక ఘర్షణలు కొనసాగడం ఇరుపక్షాలకు ప్రయోజనకరం కాదని పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివరి నాటికి యుద్ధం ముగిసే అవకాశాలపై మీడియా ప్రశ్నించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తోడు యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను కొనసాగిస్తున్నారు. రియాద్‌తో పాటు పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు సమాచారం.
సౌదీ అరేబియాలోని రాస్ తనురా ప్రాంతంలోని అరామ్‌కో చమురు శుద్ధి కేంద్ర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు హూతీల సైనిక ప్రతినిధి ప్రకటించారు. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన పేర్కొన్నారు.
దక్షిణ తైఫ్ ప్రావిన్స్, ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు ప్రాంతాల వైపు హూతీలు ప్రయోగించిన ఆరు బాలిస్టిక్ క్షిపణులను తమ బలగాలు అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. దాడుల నేపథ్యంలో మక్కా సహా పలు ప్రాంతాలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















