ఆహారాన్ని కేవలం తినడమే కాకుండా, ఆస్వాదిస్తూ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసే సమయంలో కొన్ని చిన్న అలవాట్లు పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు.
ముఖ్యంగా తినేటప్పుడు మొబైల్, టీవీ వంటి గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండాలి. అలా చేస్తే మనసు పూర్తిగా ఆహారంపైనే ఉంటుంది. పనుల ఒత్తిడితో గబగబా తినేయకుండా, కనీసం 20–30 నిమిషాల సమయాన్ని భోజనానికి కేటాయించడం మంచిది.
కొంతమంది ఆహారాన్ని సరిగా నమలకుండా తొందరగా మింగేస్తుంటారు. ఇలా తినడం వల్ల ఆహారం రుచిని పూర్తిగా ఆస్వాదించలేరు. ఇది మనసు పెట్టకుండా తిన్నట్లే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నోట్లో పెట్టుకున్న ముద్దను నెమ్మదిగా, బాగా నములుతూ రుచిని ఆస్వాదిస్తూ తింటే ఆహారంపై ఇష్టం పెరుగుతుంది, జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది.

ఒకేసారి ఎక్కువ ఆహారం ప్లేట్లో పెట్టుకోవడం కంటే, కొద్దికొద్దిగా వడ్డించుకుని నెమ్మదిగా తినాలి. అలా చేస్తే తినే ఆహారం మీద దృష్టి ఉంటుంది, అధికంగా తినే అవకాశం కూడా తగ్గుతుంది. అలాగే ఆహారాన్ని బాగా నములుతూ తినడం వల్ల రుచి తెలుస్తుంది, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
తినే ముందు, మధ్యలో, తిన్న తర్వాత కూడా ఆకలిని గమనిస్తూ తినడం చాలా ముఖ్యం. దీంతో శరీరానికి ఎంత ఆహారం అవసరమో అర్థమవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తినేటప్పుడు కూడా ఆహారం గురించి మాట్లాడుకోవడం, ఆరోగ్యకరమైన ఆప్షన్లపై చర్చించడం మంచి అలవాటు.
ఇక రోజూ తినే ఆహారాన్ని చిన్న నోట్స్‌గా రాసుకునే ‘ఫుడ్ డైరీ’ అలవాటు చేసుకుంటే ఆహారంపై అవగాహన పెరుగుతుంది. పోషక విలువలు తెలుసుకుంటూ హెల్తీ ఫుడ్ ఎంపిక చేసుకునే అలవాటు కూడా క్రమంగా వస్తుంది. ఇలా చిన్న చిన్న మార్పులతో భోజనం ఆరోగ్యకరంగా మారుతుంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews



















