బహ్రెయిన్‌లో జరిగిన సముద్ర తీర ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. దుర్రత్ అల్ బహ్రెయిన్ ప్రాంతంలోని సముద్ర తీరంలో జరిగిన ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లా వాసి శ్రీనివాస్ తోట నీటిలో మునిగి మృతి చెందారు.
శ్రీనివాస్ 2019 నవంబర్ 26 నుంచి బహ్రెయిన్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఆయన సముద్రంలో మునిగిపోయినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బహ్రెయిన్ కోస్ట్‌గార్డు బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. అనంతరం సంబంధిత అధికారులు చట్టపరమైన ప్రక్రియలను ప్రారంభించారు.
మృతుడి పని చేస్తున్న MAC సంస్థ యాజమాన్యం శ్రీనివాస్ తోట మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. విదేశాల్లో జరిగిన ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews














