పర్యావరణ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గుడ్‌న్యూస్ చెప్పింది. దిల్లీలోని సీపీసీబీ ఒప్పంద ప్రాతిపదికన ఏడాది కాలానికి 51 పోస్టులను భర్తీ చేయనుంది. సైంటిస్టు, సైంటిఫిక్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఇందులో ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సైంటిస్టు-సీ పోస్టులు 8 ఉన్నాయి. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, నేచురల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ చేసినవారు అర్హులు. సంబంధిత సంస్థల్లో సాంకేతిక నివేదికలు ప్రచురించిన అనుభవంతో పాటు ఉద్యోగ అనుభవం అవసరం. వయసు 45 ఏళ్లకు మించకూడదు. ఎంపికైన వారికి నెలకు రూ.1,48,997 వేతనం లభిస్తుంది.
సైంటిస్టు-బీ పోస్టులు 12 ఉన్నాయి. సంబంధిత మాస్టర్స్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ అర్హతతో పాటు నిర్దిష్ట గేట్ స్కోరు, ఉద్యోగ అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు. వేతనం నెలకు రూ.1,25,380.
సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు 13 ఉన్నాయి. సంబంధిత మాస్టర్స్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దిష్ట గేట్ స్కోరు అవసరం. గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు కాగా, నెలకు రూ.77,654 వేతనం చెల్లిస్తారు.
ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4 ఉన్నాయి. బీఎస్సీ లేదా బీసీఏతో పాటు ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్‌పాయింట్ పరిజ్ఞానం, నిర్దిష్ట టైపింగ్ వేగం ఉండాలి. గరిష్ఠ వయసు 32 సంవత్సరాలు. వేతనం రూ.57,498.
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు 8 ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు నీరు, మురుగునీటి నమూనాల సేకరణ, భద్రపరిచే విధానంపై అవగాహన ఉండాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు. ఎంపికైన వారికి నెలకు రూ.38,741 వేతనం లభిస్తుంది.
ఎంపిక విధానం :
అభ్యర్థులను ప్రధానంగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు అధికంగా వస్తే రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులను దిల్లీతో పాటు లఖ్‌నవూ, కోల్‌కతా, చండీగఢ్ ప్రాంతాల్లో నియమించే అవకాశం ఉంది. సంస్థ అవసరాలు, అభ్యర్థుల పనితీరును బట్టి కాంట్రాక్టు కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు లేదు. ఆన్‌లైన్ దరఖాస్తులకు 2026 సెప్టెంబరు 7 చివరి తేదీ. అధికారిక నోటిఫికేషన్, అర్హతలు, ఇతర నిబంధనలను వెబ్‌సైట్‌లో పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















