నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇవాళ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచనలు జారీ చేశారు. పలు జిల్లాల్లో గంటకు 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.
భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉండగా, వాతావరణం చల్లగా మారింది. పలు ప్రాంతాల్లో అప్పుడప్పుడు చిరుజల్లులు పడుతున్నాయి.
హైదరాబాద్ నగర పరిస్థితిని పరిశీలిస్తే, ఇవాళ మధ్యాహ్నం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల తర్వాత వర్ష తీవ్రత పెరిగి రాత్రి సమయానికి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. నగర ప్రజలు ట్రాఫిక్ అంతరాయాలు, నీటి నిల్వలు వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















